Authorization
Thu April 10, 2025 03:48:06 am
- సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదే పదే తన తప్పుడు ప్రకటనలతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హౌదాను దిగజారుస్తున్న డాక్టర్ జి.శ్రీనివాసరావును ఆ హౌదా నుంచి తప్పించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఫోరం కార్యదర్శి యం.పద్మనాభరెడ్డి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఆరోగ్య కార్యక్రమాలపై నమ్మకం, అనుభవం ఉన్న వ్యక్తిని డీహెచ్ పోస్టులో నియమించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీనివాసరావు ప్రభుత్వ కార్యక్రమాలను కించపరిచేలా ప్రకటనలు చేసి ప్రభుత్వానికే చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు.