Authorization
Thu April 10, 2025 04:15:10 pm
- రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ ప్రత్యేక కమిషనర్‌గా 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కోరెం అశోక్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన ఇప్పటి వరకూ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వద్ద ఓఎస్డీగా సేవలందించారు. ఆయనతోపాటు మరో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న బి.గోపీని సీసీఎల్ఏ కార్యదర్శిగా, వనపర్తి అదనపు కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్‌ను సీసీఎల్ఏ ప్రత్యేక అధికారిగా నియమించారు. ఇప్పటి వరకూ సీసీఎల్ఏ కార్యదర్శిగా ఉన్న కే హైమావతి, ప్రత్యేక అధికారి ఎమ్.సత్య శారద దేవీలను జీఏడీకి రిపోర్టు చేయాలంటూ జీవోలో పేర్కొన్నారు.