Authorization
Thu April 10, 2025 01:18:48 am
- చూడటానికి తరలివచ్చిన జనం
నవతెలంగాణ-శాయంపేట
హన్మకొండ జిల్లాలోని ఓ ఇంటిలో ఒకేరోజు 57 మే పుష్పాలు విరబూయడంతో స్థానికులు పువ్వులను చూడటానికి భారీగా తరలివచ్చారు. శాయంపేట మండలం పెద్దకొడెపాక గ్రామానికి చెందిన వన ప్రేమికుడు కోమనేని రఘు ఇంటి ఆవరణలో అరుదైన మే పుష్పాలు (పుట్బాల్ లిల్లీ ఫ్లవర్ - స్కాడోక్సన్ మల్టీప్లారస్) ఒకే రోజు వీరబుశాయి. ఈ పుష్పాల గడ్డను 18 ఏండ్ల కిందట ఆఫ్రికా దేశం నుంచి దిగుమతి చేసుకున్నామని తెలిపారు. ప్రతి ఏడాది మే నెలలో పువ్వు విరబూసిన రోజు నుంచి సుమారు 20 రోజుల వరకు వాడి పోకుండా ఉండటం వీటి ప్రత్యేకత అన్నారు.