Authorization
Thu April 10, 2025 02:39:21 am
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర గీత కార్మిక సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మెన్‌గా నియమితులైన సీనియర్ జర్నలిస్టు పల్లె రవికమార్ గౌడ్ శుక్రవారం పలువురు మంత్రులను కలిశారు. మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాసయాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనచారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. శనివారం తేదీ ఖరారు కానుందని సమాచారం. హైదరాబాద్‌లోని మసాబ్ట్యాంక్లో ఉన్న సంక్షేమభవన్‌లోని గీత కార్మిక సహకార ఆర్థిక కార్పొరేషన్ కార్యాలయం నుంచి పల్లె రవికుమార్ పనిచేస్తారు. ఈ మేరకు సంబంధిత శాఖ సన్నాహాలు చేస్తున్నది.