Authorization
Sun April 06, 2025 08:26:34 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇస్తే 15 పేపర్స్ లీకయ్యాయని విమర్శించారు. ఇంత ఘోరంగా పేపర్స్ లీక్ అయితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ నేతలు మానవతారారు, రియాజ్, చరణ్ కౌశిక్, చారగొండ వెంకటేష్, చెరగని దయాకర్, బాలలక్షితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అదే కమిటీ ద్వారా మళ్లీ పరీక్షలకు సమాయత్తం కావడం దుర్మార్గమన్నారు. యువత పోరాటాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతుంటే, మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.