Authorization
Sun April 06, 2025 06:37:48 pm
- రాజకీయ లబ్ది కోసం 'కేరళ స్టోరీ' మాటలు :ఓవైసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒకవైపు సైనికులు చనిపోతుంటే అవేవి పట్టించుకోకుండా ప్రధాని మోడీ రాజకీయ లబ్ది కోసం 'ది కేరళ స్టోరీ' గురించి మాట్లాడుతున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి అసత్యాలు, తప్పుడు ప్రచారాలతో కూడిన కేరళ స్టోరీని ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మాట్లాడుతున్న వీడియోను ఓవైసీ షేర్ చేశారు.