Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజేఎస్ అధ్యక్షులు కోందండరాం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రగతిశీల ఉద్యమ నేత ప్రొఫేసర్ ఓంకార్ మన మధ్య లేకపోవటం బాధాకరమని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫేసర్ కోదండరాం అన్నారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓంకార్ సంతాప సభను డాక్టర్ అజిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఓంకార్ ముక్కుసూటిగా మాట్లాడే వారని గుర్తుచేశారు. స్వతంత్రంగా ఆలోచించడంతోపాటు స్వతంత్రంగా బతకడాన్ని ఇష్టపడేవారని తెలిపారు. తాను చెప్పాల్సిన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేవారని వివరించారు. ప్రజాసంబంధాలను విస్తృతంగా నెరిపేవారని చెప్పారు. మంచి మిత్రుడిని కోల్పోయినందుకు బాధగా ఉందన్నారు. ఐఎఫ్టీయూ జాతీయ నాయకులు బూర్గుల ప్రదీప్ 'ఓంకార్ జ్ఞాపకాలు' పుస్తకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓంకార్ ఓ అద్భుతమైన మనిషి కాబట్టే..ఆయన గురించీ, ఆయన జీవితం గురించి, ఆయన కృషి గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పారు.
ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి హైదరాబాద్కు సుమారు 50ఏండ్ల కిందే వచ్చారని చెప్పారు.ఉస్మానియా యూనివర్సిటీలో పది డిగ్రీ పట్టాలు పొందారన్నారు. అదే విద్యాలయంలో పనిచేసి ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ పొందారని గుర్తుచేశారు. ప్రగతి శీల విద్యార్థి ఉద్యమం తామిద్దరి మధ్య స్నేహాన్ని పెంచిందని గుర్తుచేశారు. ఆయన వాల్రైటింగ్, బ్యానర్లు, పోస్టర్లు రూపొందిచే కృషిలో ప్రతిభావంతుడని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ప్రహ్లాద్,ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్రావు, నాగయ్య, కృష్ణారావు పాల్గొన్నారు.