Authorization
Sun April 06, 2025 09:05:13 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీల మనోగతాన్ని కర్నాటక ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిపజేశాయని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాన్యుల ఓట్లతో అధికారంలోకి వచ్చి పేద వర్గాలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. ప్రజల అవసరాలు తీర్చకుండా పెత్తందారీగా వ్యవహరిస్తే ప్రజలు ఎన్నటికైనా కూలదోస్తారని గుర్తుచేశారు. అలాంటి ప్రభుత్వాలకు ప్రజాక్షేత్రంలో పరాభావం తప్పదదనే విషయం కర్ణాటక ఎన్నికల ఫలితాల ద్వారా మరోసారి నిరూపితమైందని తెలిపారు.