Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు చాలాకాలం ఉండవని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తెలిపారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పేరుకే ఏక్తా యాత్ర అనీ, అది హిందువులను విడగొట్టేలా బీజేపీ అధ్యక్షులు బండి సంజరు యాత్ర ఉందని విమర్శించారు. ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ప్రమాదమేమి లేదు...
హిందూమతానికి వచ్చిన ప్రమాదమేమి లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ స్పష్టం చేశారు. హిందూ ఏక్తా యాత్రలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజరు మాట్లాడిన మాటలు వాస్తవ విరుద్ధమని ఖండించారు. సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచం ఏనాడో గుర్తించిందని తెలిపారు. కేవలం రాజకీయాల కోసం మతాన్ని వాడుకోవద్దని హితవు పలికారు.