Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యక్ష తరగతులను వెంటనే ప్రారంభించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సైదుల్‌రెడ్డి డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సైదుల్‌రెడ్డి మాట్లాడారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆరేండ్లుగా ఉద్యోగోన్నతులు, మూడేండ్లుగా బదిలీలు లేక ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని, విద్యార్థులకూ నష్టం జరుగుతోందని తెలిపారు. సంఘం జిల్లా కార్యదర్శి సోమ విష్ణువర్ధన్ మాట్లాడుతూ కరోనా కారణంగా రెండేండ్లుగా ఆన్లైన్లోనే తరగతులు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు నష్టం జరగకుండా వెంటనే ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ ఉపేందర్, నాయకులు మంజు భార్గవి, వెంకటేశ్వర్లు, ఉపేందర్, విద్యాసాగర్, వసంత, శ్వేత, షర్మిల, వనజ, కార్తీక్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, లచ్చిరాం పాల్గొన్నారు.
దంతాలపల్లి : పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరం ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆబిద్ అలీకి మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా ఉపేందర్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు తాళ్లూరు రవీందర్, అఫ్సర్, సురేందర్, రామలింగం, వెంకన్న, బ్రహ్మానందరెడ్డి, సంజరు, బాలాజీ, నాగమణి, నవీన్, పద్మావతి, పాషా, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. లింగాల ఘనపురం : టీపీటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు ఎనగందుల వజ్రయ్య మాట్లాడారు. అనంతరం ఇన్‌ఛార్జి తహసీల్దార్ ధీరజ్‌కుమార్‌కు మెమోరాండం అందించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గణేష్, ప్రధాన కార్యదర్శి శివకుమార్, సీనియర్ నాయకులు పరశురాములు, శ్రీహరి, రాములు, సత్యనారాయణ, సీతారాం, ఖాసిం, క్రిష్ణారెడ్డి, శ్రీనివాస్ బాబు, భాగ్యలక్ష్మీ, సుజాత, శైలజ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి : టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలపగా ఫెడరేషన్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇమ్మడి అశోక్, శేషగిరిరావు మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ విజరుభాస్కర్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు స్వరూప, వెంకటనర్సయ్య, దయాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సాహె సుల్తానా, సోమ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు : టీపీటీఎఫ్ మండల శాఖ అద్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ విజరు కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కౌన్సిలర్ వినోద్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా బాధ్యులు హేమాద్రి, రమేష్, మండల బాధ్యులు కొలుపుల శ్రీనివాస్, రవీంద్రకుమార్, రాజకన్య, జ్యోతి, రాణి, అనంతరెడ్డి, ప్రభాకర్, ఇబ్రహీం, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, యాకన్న, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు : మండల కేంద్రంలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ శైలజకు వినతిపత్రం అందించారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జగ్గయ్య, ప్రధాన కార్యదర్శి సోమ రవి, ఉపాధ్యక్షుడు ఆదినారాయణ, కార్యదర్శి మమత రవి, జిల్లా కౌన్సిలర్ మహమ్మద్ అలీ పాల్గొన్నారు.
నెల్లికుదురు : ఫెడరేషన్ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ సయ్యద్ రషీద్‌కు వినతిపత్రం అందించారు. మండల అధ్యక్షుడు బాలు మాట్లాడారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సంగ శ్రీనివాస్, జిల్లా కౌన్సిలర్లు సురేష్, వెంకటరాజం, సోమరాజు, సత్యనారాయణ, పద్మావతి, ధనలక్ష్మి, పరాంకుశ చారి, పూర్ణచందర్, సత్యనారాయణ, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : టీపీటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ నాగభవానీకి మెమోరాండం అందజేశారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీ ఎదుట మండల అధ్యక్షులు గుండా మధూకర్‌రెడ్డి అధ్యక్షతన ధర్నా నిర్వహించగా జిల్లా కార్యదర్శి కొమిరే ఉప్పలయ్య మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మీరా, దేవేంద్రచారి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, హన్మంతు, హరికిషన్, సరోజ, కౌసల్య, సాయి రాజు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.