Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాల ఆవరణలో బుధవారం డీఆర్డిఓ డీిఏ శ్రీనివాస్ అధ్యక్షతన 19 మండల మహిళా స్వయం సహాయక సంఘాలకు మొత్తం రూ.7కోట్ల7లక్షల84వేల546 విలువైన చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మహిళ సంఘాల సభ్యులు స్థానిక అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లా డుతూ... మహిళా సాధికారతకు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అండగా నిలుస్తు న్నారని అన్నారు. అలాగే ప్రజా సంక్షేమ పతకాలు రైతుబంధు, పింఛన్లు, దళితబంధు అమలు చేస్తున్నారని తెలిపారు. ఎమ్యెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వేలేరు మండల కేంద్రంలో మహిళ భవనాన్ని రూ.30లక్షలు తన నిదులనుండి ఇస్తానని హామీనిచ్చారు. పోలిస్‌స్టేషన్, మండల ఆఫీసు ధర్మసాగర్ నుండి వేలేరు వరకు డబుల్ రోడ్డు పనుల్ని వారం పదిరోజుల్లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేసిరెడ్డి సమ్మి రెడ్డి, జెడ్పీటీసీ చాడ సరిత, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షులు మాధవరెడ్డి, ఆత్మ జిల్లా చైర్మెన్ కీర్తి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ అంగోతు సంపత్, కుడా డైరెక్టర్ బిల్లా యాదగిరి, డీఆర్డీఏ శ్రీనివాస్, మహిళ జిల్లా సమైక్య అధ్యక్షురాలు బైరి రాణి, మండల ఎపీఓ తోట సుధ, కో-ఆప్షన్ జానీ ,ఎస్బీఐ ఫీల్డ్ ఆఫిసర్ దుర్గారావుతోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.