Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
మండలంలోని మట్టెవాడ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ మహమ్మద్ తాజుద్దీన్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మతి చెందాడు. శుక్రవారం బాధిత కుటుంబాన్ని ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ వేరువేరుగా పరామర్శించారు. జడ్పీ కో అప్షన్ సభ్యులు ఎండి ఖాసీం సోదరుడు మట్టవడా గ్రామ ఉపసర్పంచ్ ఎండి తాజుద్దీన్ మరణం పార్టీ కి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదే గ్రామంలో అనారోగ్యానికి గురై బాధ పడుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించారు. మున్సిపల్ చైర్మన్ డా రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ చల్లా లింగారెడ్డి, మండల అధ్యక్షులు వేం వెంకటకష్ణ రెడ్డి, ముఖ్య నాయకులు సర్పంచులు ముక్క లక్ష్మణ రావు, వైస్ ఎంపీపీ అరే వీరన్న పాల్గొన్నారు.