Authorization
Sun May 04, 2025 05:29:18 am
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
పశువుల్లో గాలికుంట వ్యాధి నివారణకు టీకాలు వేయించాలని సర్పంచ్ ఉద్దేమారి రాజ్‌కుమార్, పశుసంవర్ధకశాఖ అధికారి ఏడీ చక్రధర్‌రావు అన్నారు. బుధవారం చిల్పూర్ మండలకేంద్రంలో పశువైద్యాధికారి ప్రియాంక ఆధ్వర్యంలో మూగజీవాలకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 117 జీవాలకు టీకా అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఫయాజుద్దీన్, మధుకర్, శ్రీధర్, భిక్షపతి, యాదగిరి, సదానందం పాల్గొన్నారు.