Authorization
Mon May 05, 2025 03:16:25 am
- విజయగర్జనను విజయవంతం చేయాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. నవంబర్ 15న వరంగల్‌లో తలపెట్టిన విజయగర్జన సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. డివిజన్ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాల విస్తత స్థాయి సమావేశం గురువారం నిర్వహించగా ముఖ్యఅతిథిగా మంత్రి దయాకర్‌రావు హాజరై మాట్లాడారు. పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుటుతున్నామని చెప్పారు. ప్రతిపాదనలు పార్టీ గ్రామ శాఖ నుంచి వస్తేనే నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా గ్రామాల పార్టీ, అనుబంధ సంఘాల ప్రతినిధులు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రతినెలా అనుబంధ సంఘాల సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అర్హులకు తప్పకుండా పదవులు దక్కుతాయని వివరించారు. ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని కోరారు. నియోజకవర్గంలో రూ.2.25 కోట్ల వ్యయంతో 4 వేల 500ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే స్థలాలను గుర్తించి ఇండ్లు నిర్మింపజేస్తామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశామన్నారు. పార్టీ తొర్రూరు మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు అధ్యక్షతన వహించగా మూడు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.