Authorization
Mon May 05, 2025 04:30:23 am
హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
నవతెలంగాణ-శాయంపేట
పరకాల నుంచి శాయంపేట మీదుగా పెద్దాపూర్, వరంగల్‌కు నడిచే ఆర్టీసీ బస్సు పునరుద్ధరణతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు నుంచి శాయంపేట వరకు రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టడంతో గత మూడేళ్ల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసును అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ప్రైవేటు వాహనాలలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. ఇటీవల పరకాల డిపో మేనేజర్ పవన్ కుమార్.. ప్రయాణ ప్రాంగణంను సందర్శించిన సందర్భంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్దాపూర్ బస్ సర్వీస్ పునరుద్ధరించాలని, దీంతో విద్యార్థులకు, ప్రజలకు అనుకూలంగా ఉంటుందని విన్నవించారు. స్పందించిన డిపో మేనేజర్ పవన్ కుమార్ ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లడంతో బస్సు సర్వీసును పునరుద్ధరించారు. ఎట్టకేలకు పెద్దాపూర్ బస్సు శుక్రవారం మండల కేంద్రానికి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.