Authorization
Mon May 05, 2025 01:38:08 pm
నవతెలంగాణ-పర్వతగిరి
ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన అన్ని పనుల రికార్డులను అందజేయాలని ఎస్ఆర్పీ రవి సూచించారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో శుక్రవారం 14వ విడత సామాజికతనిఖీలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, సామాజిక తనిఖీ బందానికి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులను పరిశీలించి, వాటికి సంబంధించిన నివేదికలను ప్రజా వేదికలో చదివి వినిపించారు. అనంతరం ఎస్ఆర్పీ రవి మాట్లాడారు. ఉపాధి పథకం ద్వారా చేపట్టిన అన్ని పనుల రికార్డులను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చక్రాల సంతోష్ కుమార్, ఎంపీఓ మధుసూదన్, ఏపీఓ సుశీల్ కుమార్, ఈసీ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, డీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.