Authorization
Mon May 05, 2025 07:00:56 am
అ యూటీఎఫ్ కార్యవర్గం ఎన్నిక : జిల్లా కార్యదర్శి వెంకన్న
నవతెలంగాణ-తొర్రూరు
ఐక్య ఉద్యమాలతోనే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల సమస్యలు పరిష్కారమవుతాయని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎర్ర వెంకన్న అన్నారు. శుక్రవారం పెద్దవంగర మండల పరిది రామచంద్రు తండా ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మండల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంఘటిత ఉద్యమాలు కోసం అధ్యాపకులు, ఉపాధ్యాయ సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. అధ్యక్షులుగా గుర్రం శేఖర్, ప్రధాన కార్యదర్శిగా గుండె కనకయ్య, ఉపా ధ్యక్షులుగా చంద్రగిరి ప్రభాకర్, నాగిని స్రవంతి రెడ్డి, కోశాధికారిగా అల్వాల అజరు, జిల్లా డెలిగేట్స్ గా కోట జనార్ధన్, బానోత్ మదన్‌లాల్, కొయ్యడ. సదయ్య ఎన్నికయ్యారు.