Authorization
Sun May 04, 2025 06:39:17 pm
నవతెలంగాణ - హుజూర్నగర్టౌన్
ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు మరో పోరాటానికి సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శీతల రోషపతి కోరారు. మంగళవారం పట్టణంలో సమ్మె కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. ఈ నెల 16, 17 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టనున్న సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను పూర్తిగా ప్రయివేటీకరించేందుకు పార్లమెంటు సమావేశాల్లో మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లుకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు పోరాడడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలక సోమయ్యగౌడ్, రమణ, వెంకటేశ్వర్లు, ఉప్పతల వెంకన్న, గోవింద, నరేష్, వేణు, నరేష్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.