Authorization
Mon May 05, 2025 03:04:33 am
అ రూ.70వేలు, 5 తులాల బంగారం అపహరణ
నవతెలంగాణ-గణపురం
ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన మండలంలోని కర్కపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. డీఎస్పీ సంపత్రావు తెలిపిన వివరాల ప్రకారం... కర్కపల్లి గ్రామానికి చెందిన కట్ల దేవయ్య ఆయన భార్య దేవి ఓ ఫంక్షన్కు వెళ్లారు. అదే రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి రూ.70 వేలు, 5తులాల బంగారం, వెండి సామాగ్రి చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ సంపత్రావు, ఎస్సై ఉదరుకిరణ్ సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం, డాగ్స్వ్కాడ్తో తనిఖీలు చేపట్టి వివరాలు సేకరిస్తు న్నామని దొంగలను పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.