Authorization
Mon May 05, 2025 06:57:00 pm
నవతెలంగాణ-దంతాలపల్లి
బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాధ పిల్లలను, వద్ధులను చేరదీయడం అభినందనీయమని ప్రోగ్రామ్ మేనేజర్ లత ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ప్రాథమిక పాఠశాలలో అనాధ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో ఆదివారం ఆమె పాల్గొని పిల్లలతో కేక్ కట్ చేయించారు. బాలవికాస ఆధ్వర్యంలో అనాథ బాలలను ఆదరించడం స్ఫూర్తిదాయకమని చెప్పారు. బాలవికాస వేలాది గ్రామాల్లో తాగునీటి, విద్య, వైద్యం, పారిశుధ్యం, సేంద్రియ వ్యవసాయం, వితంతు వివక్షత నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్లు సుకన్య, శోభ, కోఆర్డినేటర్లు స్వర్ణలత, స్వరూప, యాకలక్ష్మి, వెంకటరత్నం, హిమాదేవి, ఉపేంద్ర, చాంద్ బీ, తదితరులు పాల్గొన్నారు.