Authorization
Mon May 05, 2025 03:29:06 am
నవతెలంగాణ-నర్సింహులపేట
స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా మంగీలాల్ ఆదివారం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. స్థానిక ఎస్సైగా పని చేసిన నరేష్ బదిలీపై సిరోలు వెళ్లగా మంగీలాల్‌ను ప్రభుత్వం నియ మించింది. ఈ సందర్భంగా ఎస్సై మంగీలాల్ విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు అందు బాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. పోలీస ్‌స్టేషన్ పరిధిలో ఇసుక, ఇతర అసాంఘీక కార్యకలాపాలకు ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే తనను నేరుగా సంప్రదించాలని సూచించారు.