Authorization
Mon May 05, 2025 12:53:27 pm
నవతెలంగాణ- హన్మకొండ
గ్రేటర్ 31 వ డివిజన్ న్యూ శాయంపేట పరిధిలో మంగళవారం కార్పొరేటర్ మామిండ్ల రాజు నూతనంగా ఏర్పాటుచేసిన లెక్చరర్స్ కాలనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్లోని కాలనీవాసులంతా ఐక్యమత్యంతో ఉండి అభివద్ధి సాధించాలని కోరారు. కాలనీవాసులు మాట్లాడుతూ.. కాలనీ కి కావలసిన అంతర్గత రోడ్ల నిర్మాణం, విద్యుత్, తాగునీటి సదుపాయం కల్పించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన కార్పొరేటర్ సాధ్యమైనంత త్వరలో అన్ని అభివద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు అమత రెడ్డి, సురేందర్ రెడ్డి, రఘువీర్, డాక్టర్ నాగయ్య, సుబ్బారావు, సురేందర్, శ్యాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.