Authorization
Mon May 05, 2025 11:21:46 am
- డీఈఓ జీ పాణిని
నవతెలంగాణ - ములుగు
పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ జీ పాణిని తెలిపారు. ఉత్తమ ఫలితాల సాధన కోసం డీసీఈబీ ఆధ్వర్యంలో '40 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక'ను కోసం తయారుచేసిన ప్రతులను డీఈఓ బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ ప్రణాళికను అమలు చేస్తూ విద్యార్థుల స్థాయికి అను గుణంగా ప్రత్యేక పునశ్చరణ తరగతులను నిర్వహించాలన్నారు. కరోనా కారణంగా చాలా వరకు ప్రత్యక్ష తరగతులకు దూరమైన విద్యార్థులు ఇప్పటినుండి ఈ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అనుసరించాలన్నారు. ఉపాధ్యా యుల సలహాలు సూచనల మేరకు సమయం వధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదువు కొని ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ ప్రణాళిక అమలు తీరును కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, కోఆరి ్డనేటర్లు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి విజయమ్మ, ఏసీజీఈ రమేష్, కోఆర్డినేటర్లు సుదర్శన్ రెడ్డి, రమాదేవి, సాంబయ్య, రాజు, ఎంఈఓలు శ్రీనివాసులు, రాజేష్, డీసీఈబీ సహాయ కార్యదర్శి యాసం విక్రమ్, సీనియర్ అసిస్టెంట్ కిరణ్ పాల్గొన్నారు.