Authorization
Mon May 05, 2025 04:19:03 am
నవతెలంగాణ-తరిగొప్పుల
టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని బొత్తలపర్రె సర్పంచ్ భూక్య కమలరవి అన్నారు. జెడ్పీటీసీ నిధులు రూ.5లక్షలు, ఈజీఎస్ నిధులు రూ.5లక్షలతో సీసీ రోడ్డు పనులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎంపీటీసీ భూక్య జూమ్లాల్నాయక్, ఉపసర్పంచ్ దేవ్‌సింగ్, మండల అధ్యక్షుడు పింగళి జగన్మోహన్రెడ్డి, కుర్ర మల్లయ్య దేవ్ సింగ్ పాల్గొన్నారు.