Authorization
Sat May 03, 2025 09:52:27 pm
- తీసుకేళ్లడమే లక్ష్యం : మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
నవతెలంగాణ -మహాముత్తారం
ప్రతి గడపకు వరంగల్ రైతు డిక్లరేషన్ను తీసుకేళ్లడమే లక్ష్యం అన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మహా ముత్తారంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రైతు డిక్లరేషన్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇందిరమ్మ రైతు భరోసా కింద కౌలు రైతుకు ఎకరాకు ఏటా రూ 15000 పెట్టుబడి సాయం తదితరవి అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు తప్ప ఎలాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రైతు పండించిన పంటను కొనుగోలు చేయలేని పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి నియోజకవర్గంలో రైతు డిక్లరేషన్లో లేనప్పటికీ రైతు సోదరుల పిల్లలకు చదువుకున్న వారికి వ్యవసాయ అనుబంధానికి సంబంధించిన చిన్న సహకార అనుబంధ సంస్థలను పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లింగ మల్ల శారద దుర్గయ్య , ఎంపీపీ సుభద్ర సడవలి, మండల అధ్యక్షుడు సడవలి, సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.