Authorization
Mon May 05, 2025 07:07:17 pm
- 'నవతెలంగాణ' కథనానికి స్పందన
నవతెలంగాణ-మల్హర్రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని 12వ వార్డు పరిధిలోని గౌండ్లపల్లిలో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను శనివారం నిర్వహించారు. వార్డులో నెలకొన్న పారిశుధ్య సమస్యపై శుక్రవారం 'నవతెలంగాణ' ప్రచురించిన కథనానికి పంచాయతీ పాలకవర్గం, అధికారులు స్పందించారు. ఎంపీడీఓ నర్సింహమూర్తి, ఎంపీఓ విక్రమ్‌కుమార్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పంచాయతీ కార్మికులు డ్రైనేజీల్లోని చెత్తాచెదారాన్ని, రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటిని, బురదను తొలగించారు. రోడ్డుపై తాత్కాలికంగా మట్టి పోయిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. త్వరలోనే కూలిపోయిన మురికి కాల్వలకు కొత్తగా డ్రైనేజీలు, సైడ్ వాల్స్, సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి సత్తయ్య, కార్యదర్శి శంకర్, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.