Authorization
Sun May 04, 2025 11:51:24 pm
నవతెలంగాణ-ఆత్మకూర్
సబ్బండ కులాల స్వరాజ్యం కోసం బహుజనులంతా ఏకం కావాలని డీఎస్పీ మండల అధ్యక్షుడు మైదం రవి కోరారు. విశారదన్ మహారాజ్ 10 వేల కిలోమీటర్ల స్వరాజ పాదయాత్ర 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రం నుంచి సోమవారం సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో హణమకొండ జిల్లా డీఎస్పీ ప్రధాన కార్యదర్శి మేకల యుగేందర్, మండలం అధ్యక్షుడు మైదం రవి, కోశాధికారి చీలివేరు అశోక్, కార్యకర్తలు మనోహర్, శ్రీకాంత్, రవి, పవన్, నవీన్, రమణ, జ్యోతి, కుమార్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.