Authorization
Sun May 04, 2025 01:45:53 am
- జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూరు డివిజన్ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి న్యాక్ సౌజన్యంతో భవన నిర్మాణ - నిరుద్యోగ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ ఉపాధి శిక్షణ శిబిరం ను మంగళవారం స్థానిక జడ్పీటీసీ - జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతి మహిళకు స్వయం ఉపాధి కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉందని అన్నారు. కుట్టుపనిలో నైపుణ్యం సాధించేలా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇస్తుందని అన్నారు. మన్నూరు ఉమ, రమేష్, ఇన్స్ట్రక్టర్ తదితరులు పాల్గొన్నారు.