Authorization
Mon May 05, 2025 08:20:02 am
నవతెలంగాణ-కాజీపేట
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట ఉపాధ్యక్షులు, శ్రమశక్తి అవార్డు గ్రహీత బస్కె దశరథం, రాష్ట కార్యదర్శి గిన్నారపు మహేందర్ అన్నారు. హన్మకొండ జిల్లా అధ్యక్షులు సదీక్, జిల్లా కో కన్వీనర్లు జీరిపోతుల సారంగపాణి, గిన్నారపు రవి ఆధ్వ ర్యంలో మంగళవారం కాజీపేటలో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమములో ముందు వరుసలో వుండి తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ముఖ్య భూమిక పోషించింది భవన నిర్మాణ కార్మికులు అన్నారు. తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రాష్ట్రమంతా కార్మికుల బతుకులు అగమ్య గోచరంగా పని చేస్తనే కానీ కుటుంబం గడవని కుటుంబాలు ఉన్నాయన్నారు. వలసవాదులు కాజీ పేట, హనుమకొండ, వరంగల్ అడ్డాల వద్ద కూర్చొని పనులు దొరక ఇంటికి తిరిగి వెళుతున్నారన్నారు. తెలం గాణా వ్యాప్తంగా 80 లక్షల మంది కార్మికులు ఉన్నారని కార్మికుల సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలన్నారు.