Authorization
Tue May 06, 2025 09:51:32 pm
- ఏఐకెఎఫ్ జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్రావు
నవతెలంగాణ- హన్మకొండ చౌరస్తా
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీల్లో రెండు రోజులపాటు హన్మకొండలోని నక్కలగుట్ట హరిత కాకతీయ హోట్లో నిర్వహించే జాతీయ సదస్సులను జయప్రదం చేయాలని మాడిశెట్టి భూమయ్య తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మళ్లీ రైతు వ్యతిరేక చట్టాలను దొడ్డి దారిలో అమలు చేయాలని కుట్ర చేస్తుందని ఆ కుట్రలను తిప్పి కొట్టడానికి విద్యార్థులు ముందుండాలని కోరారు. సామాజికవేత్త మాడిశెట్టి అరుణ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో జరిగే మూఢనమ్మకాలను అరికట్టే విధంగా ప్రభుత్వాలు కషి చేయాలని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ముగిచెర్ల సందీప్, జిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్, నగర అధ్యక్ష కార్యదర్శులు పి హరీష్ సంజయ్, నగర నాయకులు శ్రీనాథ్, శివ, రవితేజ, మనీ, వర్షన్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.