Authorization
Mon May 05, 2025 04:06:56 pm
నవతెలంగాణ- ములుగు
మంగపేట మండలం లోని రమణక్కపేట గ్రామం లో కనీస అవసరాలకోసం మంచినీళ్ళు లేక గ్రామ ప్రజలు తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటు న్నారని, వాటి సమస్యలు తీర్చాలని డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాల యంలో ఏవోకు వినతి పత్రం అందించారు. అనంతరం జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ మాట్లా డుతూ.. రమణక్కపేటలో విజయరావుపేట కాలని లో మిషన్ భగీరథ నీళ్ళు సరిగా రావట్లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పలుమార్లు గ్రామ మండల అధికారుల దృష్టికి తీసుకుపోయీనా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూన్నారని అన్నారు. గ్రామ పంచాయతీ పరిధి నళ్లాల బోరు ఉన్నా పైపులు లేవని వాపోయారు. అధికారులు స్పందించి సమస్యలు ప రిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటా లు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.