Authorization
Sun May 04, 2025 02:58:22 pm
- ఏరియా హాస్పిటల్ పిట్ సెక్రటరీగా శశికళ నియామకం
నవతెలంగాణ-కోల్బెల్ట్
సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్ టీయూసీ)కి భూపాలపల్లి ఏరియాలో కార్మికులు బ్రహ్మరథం పడుతున్నారని ఆ సంఘం భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జోగ బుచ్చయ్య అన్నారు. గురు వారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ సింగరేణి ఏరియా హాస్పిటల్లో హాస్పిటల్ పిట్ సెక్రటరీగా కల్లేపల్లి శశికళ, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ గా మహబూబిలను నియమించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారా నికి శశికళ, మహబూబిలు కృషి చేస్తున్నారని, వారిని గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. కార్మికుల కు ఐఎన్టియుసి మాత్రమే ఏకైక పరిష్కారంగా, దిక్సూచిగా నిలుస్తోందన్నారు. రానున్న ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో సంఘాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్వరాష్ట్రలో సింగరేణి సంస్థ, ఉద్యో గుల భవితవ్యం మారుతుందని ఆశిస్తే సంస్థను ప్రైవే టీకరించే దిశగా పయనిస్తుండడం దారుణమన్నారు. ప్రాణ త్యాగాలు చేసైనా సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. అనంతరంశశికళ, మెహబూబి మాట్లాడుతూ... తమ ఎన్నికకు సహకరించిన నాయకులు, ఉద్యోగులకు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ నాయకురాలు మద్దినేని శేషారత్నం, బ్రాంచ్ నాయకులు మంగళంపల్లి బాలరాజు, పొనుగంటి కష్ణ, సమ్మయ్య, రాజయ్య, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.