Authorization
Sun May 04, 2025 05:50:37 am
నవతెలంగాణ-కాజీపేట
కాజీపేట 47వ డివిజన్ బాపుజీ నగర్ చౌరస్తా జయ లక్ష్మి హాస్పిటల్ నుండి పెద్ద మోరి వరకు డ్రైనేజీ నిండి ఇళ్లకు మురికి నీరు చేరి ప్రజ లు ఇబ్బందులు పడుతు న్నార ని టీడీపీ జిల్లా సీనియర్ నా యకులు చిలువేరు మహేష్ అన్నారు. డ్రైనేజీ సమస్యను ప రిష్కరించాలని కోరుతూ టిడిపి నాయకులు మంగ ళవారం డ్రైనేజీని పరిశీలించడం జరిగింది. అనంతరం మహేష్ మాట్లాడుతూ జ యలక్ష్మి హాస్పిటల్ నుండి పెద్ద మోరి వరకు డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా మారిం దని, పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదన్నారు.స్థానిక ప్రజలు సమస్య పరిష్కారం కొరకు తమకు తెలుపగా డ్రైనేజీని పరిశీలించి తక్షణమే సానిటరీ ఇన్స్పెక్టర్ను పిలిపించిపరిస్థితిని వివరించి జెసిబి సహాయంతో తాత్కా లికంగా మోరిని శుభ్రం చేయించడం జరిగింది. ప్రజలకు ఇబ్బందిగా మారిన డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరడం జరుగుతుందన్నారు.