Authorization
Sun May 04, 2025 11:04:10 am
నవతెలంగాణ- హన్మకొండ చౌరస్తా
తనపై అత్యాచారం చేసిన బీఆర్ఎస్ లీడర్ గోపాల నవీన్రాజ్ను చట్ట ప్రకారం శిక్షించాలని, తనకు ప్రాణాపాయం ఉందని అతని నుండి తనను రక్షించాలని అత్యాచారానికి గురైన ఎస్ అంజనేయ దేవి వేడుకున్నారు. మంగళవారం వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వరంగల్ కు చెందిన బీఆర్ఎస్ లీడర్ గోపాల నవీన్ రాజ్ తనపై అత్యాచారం జరిపి 19 నెలలు కావస్తుందని, అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిందని అన్నారు. కానీ, కేసుపై చట్ట ప్రకారం కోర్టులో చూసు కోకుండా అతని మనుషులతో కేసు వాపస్ తీసుకోవాలంటూ భయభ్రాం తులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా అతనిపై చర్యలు తీసుకోకపోవడంతో తనను వెంబడించి చంపుతానని బెదిరిస్తున్నాడని అన్నారు. తనకు న్యాయం చేయమని వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ని కూడా కలిశానని, అతను కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. అధికార బలంతో అధికార పార్టీ అండదండలతో కేసు విత్ డ్రా చేసుకోమని మాన సికంగా శారీరకంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. అతని నుండి రక్షించి జీవన భృతి ఇప్పించాలని వేడుకున్నారు.