Authorization
Sun May 04, 2025 08:01:29 am
నవతెలంగాణ-గణపురం
మండలం లోని లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర సహిత అభ యాంజనేయ స్వామి ఆలయంలో తాగునీటి సౌకర్యార్థం బుధవారం కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ గండ్ర సత్యనారాయణ రావు సొంత ఖర్చలతో బోరు వేయించి మోటారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా సర్పంచ్ ఒద్దుల విజయ అశోక్‌రెడ్డి బోరు తవ్వకం పనులు ప్రారంభించారు. దీంతో సందర్శకులకు నీటి సమస్య తీరిపోవడంతో జీఎస్ఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉపసర్పంచ్ మొలుగూరి రాజు, ఏడెల్లి మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వీరమల్ల సంపత్ రెడ్డి, ఓద్దుల రాంరెడ్డి, పున్నం రఘుపతి రెడ్డి, సదానందం పాల్గొన్నారు.