Authorization
Mon April 14, 2025 11:32:56 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో చెన్నూర్ గ్రామవాసి, మానవతావాది గఫార్ దాతత్వంతో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రంను సర్పంచ్ శ్రీపతిబాపు ఆదివారం ప్రారంభించారు. బాటసారులకు ప్రయాణికులకు విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా బస్టాండ్ దాహం తీర్చే చల్లని నీరు అవుతుందని సర్పంచ్ అన్నారు. బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు చేసన గఫార్ను అభినందించారు. దాతలుగా సహకరిస్తామంటే మరిన్ని సేవలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ షాహీన్ ఖాన్, నాయకులు మెరుగు లక్ష్మణ్,చిలుక రమేష్, సలీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.