Authorization
Mon April 14, 2025 07:46:52 am
నవతెలంగాణ- స్టేషన్ఘనపూర్
డివిజన్ కేంద్రంలో శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థాన బ్రహ్మౌత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం మహా పూర్ణాహుతి, చక్ర స్నానంతో బ్రహ్మౌత్సవాలు ముగిశాయి. వేడుకల్ని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కలకోట రంగాచార్యులు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కలకోట రామానుజ చార్యులు, శేషా చార్యులు జరిపించారు. గన్ను వెంకట నారాయణ జ్ఞాపకార్థం యాగశాల నిర్మాణ దాత గన్ను శ్రీనివాస్, సునీత దంపతులు, నిఖిత, రితిక, కుంభం నరేందర్, మహంకాళి రవీందర్, కొలిపాక సతీష్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తెల్లాకుల రామక్రిష్ణ, సోమశేఖర్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.