Authorization
Fri April 11, 2025 08:15:48 am
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టెన్త్ విద్యార్ధినిల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు, రక్త ాహీనత సమస్యను తొలగించేందుకు ప్రత్యే కంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయుష్ జిల్లా ఇంఛార్జి డాక్టర్ యస్. మహేం ద్రకుమార్ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలమచిలీ బజార్లో నేషనల్ ఆయుష్ మిషన్ స్కూల్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్యను అధిగమిస్తే విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను సాధించే అవకాశం వుంటుందన్నారు. విద్యాశాఖ సహకారంతో మూడు రోజుల పా టు వివిధ పాఠశాలల్లో అవగాహన కల్పించడం జరుగుతోందని అందులో భాగంగా హనుమకొండ జిల్లాలో 9 ప్రభుత్వ బాలికలపాఠశాలలను ఎంపిక చేయడం జరిగింద న్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించి ఆయుష్ కీట్ లను అందజేశారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థుల మానసిక వత్తిడిని తగ్గించేందుకు కౌన్సెలింగ్ అలాగే జ్ఞాపకశక్తిని, వ్యాధినిరోధక శక్తి పెంపొందించడం కోసం ఆయుష్ కిట్ ఉపోయోగపడుతోందన్నారు.