Authorization
Mon April 07, 2025 03:43:58 am
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రమాదవశాత్తు జరిగే అగ్ని ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తుల పరి రక్షణకు అగ్నిమాపక సేవలను సద్వినియోగం చేసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారి ఎల్. దయాసాగర్ తెలిపారు.అగ్నిమాపకశాఖ వారోత్సవాల్లో భాగం గా శనివారం ప్రమాదవశాత్తు ఏర్పడే మంటలను ఆర్పి వేసేందుకు మండల కేం ద్రంలో గల ప్రధాన కూడలల్లో డెమో నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ అగ్ని మాపక శాఖ అందిస్తున్న సేవలను ప్రజలకు వివరించారు. అగ్ని ప్రమాదాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తిన అగ్నిమాపక సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎలాంటి అగ్నిమాపక ప్రమాదాలు సంభవించిన సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నివారణ చర్యల పట్ల అగ్నిమాపక శాఖ కరపత్రాలను, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రజలను చైతన్యం చేశా రు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పి.కిరణ్ కుమార్,జి. శ్యాంసుందర్, పి.సందీప్,పి. అశోక్,బి.వెంకటేశ్వర్లు,ఆర్. వెంకటేష్,పి.నర్సింహ్మ,కె.రాజు,ఆలయ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.