Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు - జనగామలో భారీ ర్యాలీ ప్రదర్శన
నవతెలంగాణ-జనగామ
మేడే ఉద్యమాల స్ఫూర్తితో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటా లు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డిలు పిలుపు నిచ్చారు. మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం జనగాం జిల్లా కేంద్రంలో కార్మికులు మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. జనగామ పట్టణ మం తా ఎరుపుమయమైంది. కార్మికులంతా కదం తొక్కారు. డప్పు చప్పుళ్ళు, డీజే ఎర్ర జెండా పాటల నత్యాలతో కోలాహాలంగా ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ చౌరస్తా నుండి వైష్ణవి గార్డెన్ వరకు భారీ ప్రదర్శనగా కార్మికులు కదిలి వచ్చారు. అనంతరం వైష్ణవి గార్డెన్లో మే డే బహిరంగ సభ సీపీఎం, సీఐటీయూ టౌన్ కార్యదర్శులు జోగు ప్రకాష్, సుంచు విజేందర్అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమా వేశంలో ముఖ్య అతిథులుగా సీపీఎం జిల్లా కార్యదర్శి మాకు కనకరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు పాల్గొని మాట్లాడారు. మే డే అంతర్జాతీయ కార్మిక వర్గా ఐక్యతకు సంకేతం అని కొనియాడారు. కార్మిక వర్గ చైతన్యానికి ప్రతి రూపమని దోపిడికి వ్యతిరేకంగా వేలాది గొంతుకలు ఒకటైన రోజు అని పేర్కొన్నా రు. మేడే అమరవీరుల స్ఫూర్తితో ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఇర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి,బి.చందునాయక్,అజారుద్దీన్, నరేం దర్, ఉపేందర్, సీపీఎం, సీఐటీయూ ప్రజా సంఘాల జిల్లా పట్టణ నాయకులు మిట్యానాయక్, దస్తగిరి, కళ్యాణ లింగం,దూసరి నాగరాజు, పందిళ్ళ కళ్యాణి, వెం కట మల్లయ్య, పి.లలిత, చీర రజిత, బ్లెస్సింగ్టన్, విష్ణు, సుభాషిని, వెంకటేష్, మల్లేష్, రాజ్, కచ్చగాల వెంకటేష్, డప్పు కళాకారులు పాల్గొన్నారు.