Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
బైక్ మెకానికుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం మండల అధ్యక్షుడు మియాపూర్ రాధా కృష్ణ చారి, కార్యదర్శి మేకల సంపత్, కోశాధికారి వెం కట్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని మేడేను పురస్కరించుకొని కార్మిక జెండా ఆవిష్క రించిన అనంతరం సమావేశంలో మాట్లాడారు. తాము ఇబ్బందులకు గురవు తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే మాకు సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు నేరుగా వ్యక్తిగత అకౌంట్లో జమ చేయాలన్నారు. మాకు మండల కేంద్రంలో ఒక భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరినట్లు తెలిపారు. అలాగే ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు మడుపు ఈశ్వర్, వెంకన్నతో బైక్ మెకానిక్లు పాల్గొన్నారు.