Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ సంబంధాలను గుర్తు చేసేదే చిరుతల రామాయణం : పుట్ట మధు
నవతెలంగాణ- కాటారం
కాటారం మండలం దామరకుంట గ్రామంలో చిరు తల రామాయణం నాటక ప్రదర్శన కొనసాగుతోంది ఇందులో భాగంగా మూడవరోజు మంగళవారం శ్రీరామచంద్రుని శోకాసనం ఘట్టం ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొని నాటక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ముఖ్య అతిథిగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, భూపాల పల్లి జిల్లా నాయకులు జక్కు రాకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ మానవ సంబంధాలను గుర్తుచేసేదే చిరుతల రామాయణం అని అన్నారు. చిరుతల రామాయణంలో ప్రతి ఒక్కరు కొన్ని సందర్భాల్లో ఏడుస్తూ, నవ్వుతూ ఉంటారని గుర్తు చేశారు. సీతాదేవి స్త్రీలకు ఆదర్శమన్నారు. మానవజాతికే అన్నద మ్ములంటే రామలక్ష్మణులు ఆదర్శమన్నారు. నేటి కాలం యువత తండ్రి ముందే సిగరెట్ మందు తాగుతున్నారని, మొబైల్స్‌తో పూర్తిగా యువత చెడిపోయిందని అన్నారు. చిరుతల రామాయణం పట్టాభిషేకానికి విరాళం అంద జేశారు. ఎంపీటీసీ బాసాని రవి, కుడుదుల రాజబాపు, భూపెల్లి రాజు, జిల్లాల శంకర్, రామ్ శెట్టి ఆంజనేయులు, రాజు, తదితరులు పాల్గొన్నారు.