Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గాయత్రి
నవతెలంగాణ -మహాముత్తారం
మండలంలో ఏ వృద్ధులు కూడా హింసకు గురికాకుండా చూసుకోవాలని, కన్న తల్లిదండ్రులను హింసిస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అని, వృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సఖి సెంటర్ సిఏ గాయత్రి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 పై మహా ముత్తారం మండల కేంద్రంలో ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు ఆధ్వర్యంలో మండల స్థాయి అవగాహన కార్యక్ర మం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఆమె హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు జెడ్పిటిసి లింగంపల్లి శారద ,ఎంపీపీ రత్నం సుభద్ర,ఎంపీటీసీ , శ్రీపతి సురేష్, పి.ఎ. సి .ఎస్ సి చైర్మన్ సోమ శాంత కుమార్ ,పోలారం సర్పంచ్ వి. సరిత, కునుకునూరు సర్పంచి లక్ష్మీ తో పాటు సఖి కేసు వర్కర్ మాదవి, తాసిల్దార్ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత, భాగ్యలక్ష్మి, ఏపిఎం రామకృష్ణ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.