Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక వర్షాలతో పంటలన్నీ నీళ్లపాలు
- పట్టాలు లేక బీమా రాదు
- ప్రభుత్వం పట్టించుకోదు
- ఇదీ ఏజెన్సీ రైతుల గోడు
నవతెలంగాణ-కొత్తగూడ
ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే రైతులకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా పట్టించుకునే నాధుడు లేక పోవడంతో ఏమి చేయాలిరా దేవుడా అంటూ కన్నీటి పర్యం తతమవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించే ఏ పథకం కూడా రై తులకు అందక దేవుని పై భారం వేసి రైతన్నలు కుమిలి పోయే దుస్థితిలో ఉన్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకుల మా టలు నీళ్ల మూటలు అవుతున్నాయి. తమ గోడు ఎవరికి చెప్పు కోవాలో తెలియక నవతెలంగాణకు తమ కన్నీటి గాధలు విని పించారు. ఏజెన్సీ మండలాలో సాగు భూములకు పట్టాలు లేవు. దీంతో ఏజెన్సీ రైతులు పంటల బీమా చేసుకోలేక పో తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు బందు,రైతు బీమా ఏజెన్సీ రైతులకు సక్రమంగా అందడం లేదు.రైతుబందు ఇస్తు న్నామని వంక చూపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు లకు అందించే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. దీంతో ఏజెన్సీ రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయింది. ఎక్కు వ వర్షాలు కురిసినా, కురవక పోయినా చేసేది ఏమీ లేక దేవుడిపై భారం వేసి రైతన్నలు కుమిలిపోతున్నారు. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలకు మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతినగా వందలాది ఎకరాల్లో వరి పంట నీటిపాలైంది. ఎవరిని కదిలించినా ఆరుగాలం కష్టించి, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట నీటిపాలైంది అంటూ బోరున విలపిస్తున్నారు. మాకు ఎన్ని కష్టాలెదురైనా ఏ ప్రభు త్వము, ఏ నాయ కుడు మారైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాల కడలిలో ఉన్న మా కన్నీళ్లు తుడిచేది ఎవరంటూ రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.
పెట్టుబడి పూడేటట్టు లేదు : బిట్ల లచ్చమ్మ, మహిళా రైతు -గుండంపల్లి
మా మండలంలో రైతులకు ప ట్టాలు లేకపోవడంతో ప్రభుత్వం కల్పించే రాయితీలు పొందలేక పోతు న్నాము. ఈ చెడగొట్టు వానల కార ణంగా పెట్టిన పెట్టుబడి పూడేటట్టు కనిపిస్తలేదని దీంతో అప్పుల భారం ఎక్కువైతుంది. ఈ వర్షాల కారణంగా పంటలు నష్టపోవడం వల్ల మా పిల్లలకు ఆదేరువు లేకుండా పోతుంది. రైతులకు ఎన్ని నష్టాలు, కష్టాలు ఎదురైనా ధీమాగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం భరోసగా నిలవాలని కోరారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : ఈసం శంకర్ రావు, రైతు - తిమ్మాపురం
వ్యవసాయం కోసం అప్పులు చేసి పె ట్టుబడులు పెడుతున్నా రైతుల కష్టం మా త్రం నీటిపాలవుతోంది. వర్షాలు వస్తున్నా వర్షాలను లెక్కచేయకుండా ధాన్యం తడవకుండా జాగ్రత్త ప డుతూ ధాన్యాన్ని విక్రయిద్దామనుకుంటే యాసంగి కొనుగోలు కేంద్రాలు లేకపాయే. సంబంధిత అధికారులు స్పందించి వెం టనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల క ష్టాలు తీర్చి అండగా నిలవాలని కోరుతున్నాం.
నష్టపరిహారం అందించాలి : బోడ భద్రమ్మ, మహిళా రైతు-మైలారం తండా
ఇటీవల కురి సిన వడగళ్ళ వర్షాల కా రణంగా నాలుగు ఎకరాల వరి పంట నేల రాలిపోయి మొలకెత్తే దశకు చేరుకుంది. ఆ రుగాలం ఏపని చేసుకోకుండా పంట పొలా లకు అంకితమై పనిచేస్తే పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. సంబంధిత అధి కారులు, అధికారులు అండగా నిలిచి రైతులకు నష్టపరిహారం అందించే విధంగా కృషి చేయాలి.
రైతన్నలకు ప్రభుత్వం భరోసాగా నిలవాలి : బూర్క వెంకటయ్య, అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు
కొత్తగూడ మండలంలోని అన్ని గ్రామాలలోని రైతులు వ్యవ సాయాన్ని నమ్ముకొని జీవనం సా గిస్తున్నారు. ఈ క్రమంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా లక్షలు పె ట్టుబడి పెట్టి సాగు చేసిన పంట లు నీటమునిగి, విత్తనాలు మొల కెత్తి వరి మొదలు బూజుపట్టి ఇలా అనేక రకాలుగా రైతులు తీవ్ర న ష్టానికి గురవుతున్నారు. ఏజెన్సీ రైతులకు పట్టాలు లేక పంట లకు ఇన్సూరెన్స్ చేసుకోలేకపోతున్నారు. కనుక రాష్ట్ర ప్రభు త్వం ఏజెన్సీ రైతులపై దృష్టి సారించి పట్టాలు లేకున్నా వేసిన పంటలకు ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీ రైతులకు పట్టాలు లేకున్నా రైతుబంధు, రైతు బీమా వర్తించే విధంగా చర్యలు తీసుకోని రైతన్నలకు భరోసాగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.