Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
ప్రజల భాగస్వామ్యం లేనిది అభివృద్ధిలో ముందడుగు వేయలేమని మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు. మండల కేంద్రంలో సర్పంచ్ ఆధ్వర్యంలో శుభ్రత-పరిశుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పరిశుభ్రత పై ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు తనదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు. రోడ్ల పై మట్టి,డ్రైనేజీలోని వ్యర్ధాలు, ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించడానికి పారిశుధ్య కార్మికులు శ్రమిస్తున్నారు. ప్రభుత్వాలు అమలు చేసే అనేక అభివద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల విజయవంతానికి గ్రామ పంచాయతీలే కీలకంగా పనిచేస్తాయన్నారు. గ్రామంలోని ప్రజల జీవనానికి కావాల్సిన కనీస వసతులు, సౌకర్యాలు కల్పించడానికి జనాభా కు అనుగుణంగా నిధులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో పారిశుధ్యం, పచ్చదనం, వీధిదీపాల ఏర్పాటు, గ్రామాన్ని శుభ్రం చేయడం, రోడ్డు వేయడం, నిర్వహించడం లాంటి పనులు చేస్తుందన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే పరిశుభ్రత నూటికి నూరు శాతం సాధించవచ్చన్నారు. ప్రజల సహకారంతో పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దుతామన్న విశ్వాసం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్,మండల పరిషత్తు మాజీ కో ఆప్షన్ మెంబర్ ఆయూబోద్దీన్,నాయకులు చిలుక రమేష్,కాలనీ వాసులు పాల్గొన్నారు.