Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని ప్రభుత్వాలు
నవతెలంగాణ-చెన్నారావుపేట
ప్రభుత్వాలు, పాలకులు మారిన స్వరాష్ట్రంలో కౌలు రైతులను పట్టించుకునే ప్రభుత్వాలు లేవని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక స్వరా ష్ట్రంలో కౌలు రైతులను పట్టించుకునే పాలకులు లేరని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం అందించే రైతుబంధు,బీమా, రుణమాఫీ పంట రుణాలు కేవలం భూమి ఉన్న రైతుల కోసమేనా అని ప్రశ్నిస్తున్నారు. తమకు భూములు లేకున్నా భూస్వా ముల భూములు కౌలుకు తీసుకొని పంటలు పండుకున్న కౌలు చెల్లిస్తూ అప్పలపా లై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మని పేర్కొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వంట నష్టాలు జరిగి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పంట నష్టాలు జరిగినప్పుడు కౌలు రైతులను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాలని కో రుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కౌలు రైతులను అన్ని విధాల ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
పంట చేతికి రాకపోయినా కౌలు చెల్లించాల్సిందే :
వీరమల్ల మల్లయ్య, రైతు, చెన్నారావుపేట
ఏళ్లుగా రైతుల భూములు కౌలుకు తీసుకొని మిరప, మొక్కజొన్న ,వరి పంట లు పండిస్తున్నాం గత రెండేళ్లుగా అకాల వర్షాల కారణంగా పంటలు వడగళ్ల వాన కారణంగా నేలపాలైంది. దీంతో పంట తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికి రాక పోయినా కౌలు మాత్రం తప్పనిసరిగా చెల్లించాలి. అకాల వర్షం కారణంగా పెట్టు బడులు కూడా రావని, పర్యవేక్షించాల్సిన వ్యవసాయ అధికారులు తూతూ మం త్రంగా పర్యవేక్షిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతుల్ని రికార్డుల్లో ఎక్కించడం లేదని అన్నారు. గతంలో ప్రభుత్వాలు కౌలు రైతుకు ఏనా డు సాయం చేసింది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారైనా ప్రభుత్వాలు కౌలు రైతులను గుర్తించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.