Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
స్తంభం కూలి విద్యుత్ షాక్తో ఎద్దు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బోజేర్వు గ్రామ పంచాయతీలో కాసాని మల్లయ్య నీలమ్మకు చెందిన ఎద్దు విద్యుత్ షాక్తో ఆదివారం సాయంత్రం మృతి చెందింది. బోజేర్వు ఊరు శివారులో స్మశాన వాటిక దగ్గరలో ఈదురు గాలితో స్తంభం కూలడంతో 11కె కరెంటు తీగలు తెగిపడటంతో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. తమ ను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు రోధిస్తూ వేడుకుంటున్నారు.