Authorization
Fri April 04, 2025 01:32:36 pm
నవతెలంగాణ-హన్మకొండ/సుబేదారి
అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులకు ఆదర్శం అని డీవైఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ అన్నారు. ఆదివారం 49 వ డివిజన్ ప్రగతినగర్ లో డివైఎఫ్ఐ హన్మకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 99 వ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి త్యాగాలను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకుని పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అల్లూరి ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరు కషి చేయాలని కోరారు. సీతారామరాజు విప్లవం విజయ వంతం కాకపోయినా, ఆయన ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజపరచి, వారిలో జాతీయతా భావాన్నీ, దేశభక్తినీ పురిగొ ల్పాయి. సన్యాసి జీవితం గడిపిన రాజు, తన స్వీయ ముక్తి కంటే, అణగారిన ప్రజల సాంఘిక, ఆర్థిక విముక్తికి కషి చేయ డమే తన విద్యుక్త ధర్మమని భావించాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు చిలుక జంపన్న, శివరాత్రి కర్నకర్, రచపుడి యువన్, పండగ శివాణి, ప్రణరు, రాధిక, సునీత, రాధికా తదితరులు పాల్గొన్నారు.