Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతి సెక్రటరీలను న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి తక్షణమే సమ్మె ను విరమింపజేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శు ల నిరవధిక దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లా డారు. గత రెండువారాలుగా నిరవధిక సమ్మె చేస్తు న్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు కెవిపిఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు రాష్ట్ర ప్రభు త్వం పంచాయతీ సెక్రటరీల సకల సేవలను ఉప యోగించుకుంటూ వారి పట్ల సవతి తల్లి ప్రేమ కనబరుస్తుందన్నారు ముగిసిన ప్రొబిషన్ పిరియడ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చిన జీవోకు క ట్టుబడి వారిని క్రమబద్ధీకరించి ప్రభుత్వం తన చిత్త శుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ప్రాథమిక అవస రాలు తీరని 15వేల రూపాయల జీతాలతో 60/70 కిలోమీటర్లు ప్రయాణం చేసి వారి విధులు నిర్వర్తిస్తున్నా రెగ్యులరైజ్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. మొదటగా మూడేళ్ల ప్రొబిషన్ పిరియడ్ అని తర్వాత ముఖ్య మంత్రి మరో సంవత్స రకాలం పెంచి మొత్తం నా లుగు సంవ త్సరాల కాలం పూర్తయిన తర్వాత కూ డా క్రమబద్ధీకరణలో తాత్సారం చేయడం చూస్తుం టే ఇది మాటల ప్రభుత్వమే గాని చేతల ప్రభుత్వం కాదని స్పష్టమవుతుందన్నారు. ఈ జీతభత్యాలు కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఇస్తున్నా రని చెప్పారు 9,000 మంది పంచాయతీ సెక్ర టరీల క్రమబద్ధీకరణ డిమాండ్ న్యాయబద్ధమైనద న్నారు. పక్క రాష్ట్రంలో రెండేళ్ల కాలానికే సెక్రెటరీ లను క్రమబద్ధీకరణ చేసిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం మర్చిపోవొద్దు అన్నారు.చాలా రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం చర్చలకు పిలిచి బేషరతుగా సమ్మె విరమింపజేయాలని చెప్పారు. నెలరోజుల తర్వాత రెగ్యులర్ చేస్తామని మాట దాటవేయడం మంచిది కాదన్నారు. చర్చల కు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చా లని డిమాండ్ చేశారు. లేనట్లయితే కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.