Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి
నవతెలంగాణ-మల్హర్రావు
పల్లెలు పచ్చదనంతో పరిమలిల్లాలని ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకతి వనాలు, నర్సరీల్లో పెంచుతున్న మొక్క లు వాడిపోకుండా చూడాలని మండల పరిషత్, ఐజిస్ అధికారులను భూపాలపల్లి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్ విజయలక్ష్మి ఆదే శించారు. గురువారం మండల కేంద్రమైన తాడి చెర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈజిఎస్, కార్యాల యం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో నాటిన, నర్సరీల్లో పెంచుతున్న మొక్కలకు ఉదయం, సాయంత్రం రెండు పూటలు నీరు పెట్టాలన్నారు. మొక్కలు వాడిపోకుండా ప్రతి మొక్కను బతికిం చాలి, మొక్కలు వాడితే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. ఉపాధిహామీ పథకంలో కూలీలకు వెజ్ పేమెంట్, లేబర్ మొబిలైజేషన్, స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ పిర్ వెరిపికేషన్ తదితర వాటిపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అనంతరం ఎంఎల్ఏపి ప్లాంటేషన్ పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. మొదటి సరిగా వచ్చిన ఆమెను మండల పరిషత్,ఈజిఎస్ అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ ఏఈ అశోక్, ఎంపిఓ విక్రమ్, ఏపీఓ హరీష్, సూపర్ డెంట్ శ్రీరామమూర్తి,జూనియర్ అసిస్టెంట్ ఆదిత్య,ఈజిఎస్ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ పాల్గొన్నారు.